Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటేశ్వర్
అధికారిక పర్యటనలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి ని ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన నూతన కలెక్టర్ కార్యాలయం (IDOC)లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావిస్తూ మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవు పెంపు మరియు ఉద్యోగుల హెల్త్ కార్డు, ఐసిడిఎస్ మరియు అంగన్వాడీ మహిళా ఉద్యోగులు ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్వారా నివేదించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన చైర్పర్సన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన చైర్పర్సన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు జిల్లా చైర్మన్ అలుక కిషన్, కిషన్ తో పాటు కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు అధిక సంఖ్య పాల్గొన్నారు.