Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మిస్తున్న చిత్రం 'యూనివర్సిటీ'. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ, 'భారత్ దేశం లాంటి వర్ధమాన దేశాల్లో లక్షలాది మంది యువత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆశావహ దృక్పథంతో ఉన్నారు. దీని కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీలు అయిపోతూవుంటే వాళ్ళు కన్న కలలు ఏమైపోవాలి. వాళ్ళ గమ్యం అగమ్య గోచరం అయిపోతూ, నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకూడదు. ప్రశ్నా పత్రాలు లీకేజీ అవుతుంటే విద్యార్థుల భవిష్యత్ ఏమి అవ్వాలి? లంభకోణం చెప్పేవాడు కుంభకోణం చేసుకు పోతూ ఉంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు గిల గిల లాడి పోతుంటే ఈ విద్యా వ్యవస్థకు అర్థం ఎక్కడుంది?, మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చెప్పే సినిమా ఇది. విద్యార్థుల సమస్యలకు ప్రతిబింబంగా ఉంటుంది. సెన్సార్ పూర్తయ్యింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు : గద్దర్, నిస్సార్, మోటపలుకుల రమేష్, వేల్పుల నారాయణ, గాయకులు : గద్దర్, సాయిచరణ్, గోస్కుల రమేష్, పల్లె నరసింహం, ఎడిటింగ్ : మాలిక్, కెమెరా : బాబురావుదాస్, కథ-స్క్రీన్ప్లే-మాటలు-సంగీతం-దర్శకత్వం-నిర్మాత : ఆర్.నారాయణమూర్తి.