Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రం 'రామబాణం'. సోమవారం ఈ చిత్రంలోని మూడవ లిరికల్ వీడియోను 'ధమాకా' హీరోయిన్ శ్రీలీల రిలీజ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మిక్కీ జె మేయర్ ఈ పాటని మెస్మరైజింగ్ ట్రాక్‌గా కంపోజ్ చేశారు. ఇటు మెలోడి, అటు బీట్ రెండిటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ... మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా 'నువ్వే..నువ్వే' పాటని స్వరపరిచారు. తను ఇష్టపడే అమ్మాయి అందంపై హీరో ప్రశంసలు కురిపించే పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. రితేష్ జి రావు ప్లజెంట్ వాయిస్ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చింది. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ పాటలో విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. గోపీచంద్, డింపుల్ హయాతి అందంగా కనిపించారు. దినేష్ కుమార్ పాటకు చక్కని కొరియోగ్రఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్
ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహనిర్మాత.
జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని మే 5న భారీస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.