Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం 'పొన్నియిన్ సెల్వన్ 2'. గత ఏడాది విడుదలై, ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని.. బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టిన 'పొన్నియిన్ సెల్వన్ 1' చిత్రానికి ఇది కొనసాగింపు. చోళుల గురించి తెలియజేసే సినిమా ఇది. ఈనెల 28న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
దిల్ రాజు మాట్లాడుతూ, 'మణిరత్నం డైరెక్ట్ చేసిన అమృత సినిమాతో నేను సినీ రంగంలో జర్నీ స్టార్ట్ చేశాను. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1ను తెలుగు రాష్ట్రాల్లో మా బ్యానర్ విడుదల చేసింది. చాలా గ్రేట్ సక్సెస్ అందుకున్నాం. ఇప్పుడు పీఎస్ 2 (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2) కూడా మా బ్యానర్లోనే రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.
ఐశ్వర్యా రారు మాట్లాడుతూ, 'ఈనెల 28న మీ అందరినీ థియేటర్స్‌లో కలుస్తాం. మణిరత్నంకి థ్యాంక్స్. ఆయనతో ఇరువర్ నుంచి ఇప్పటి వరకు నా జర్నీ ఉంది. నిర్మాత సుభాస్కరన్‌గారు అందించిన తిరుగులేని సపోర్ట్‌తో గొప్ప మ్యాజికల్ ప్రంచాన్ని క్రియేట్ చేయగలిగాం. గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసే అవకాశం కలిగింది. ప్రతి క్షణాన్ని ఆడియెన్స్ ఎంజారు చేస్తారు' అని అన్నారు. 'తెలుగు ప్రేక్షకులు మాకు ఇస్తున్న సపోర్ట్‌కి చాలా సంతోషంగా ఉంది. మణిరత్నం, సుభాస్కరన్, దిల్ రాజు కలిసి ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్‌కు అందిస్తున్నారు. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను' అని సుహాసిని మణిరత్నం చెప్పారు. మణిరత్నం మాట్లాడుతూ, 'దీన్ని రెండు భాగాలుగా చేయటానికి కారణం రాజమౌళి. అందుకు తనకు థ్యాంక్స్. జయం రవి, కార్తి, విక్రమ్, ఐశ్వర్య రారు, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి, తోట తరణి, శ్రీకర్ ప్రసాద్, రెహమాన్ సహా గొప్ప టీమ్‌తో పని చేశాను. వారందరి సపోర్ట్‌తోనే ఈ సినిమాను గొప్పగా చేయగలిగాను' అని అన్నారు.