Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇందులో నా పాత్ర పేరు గాడ్. చాలా పవర్ ఫుల్ పాత్ర అది. వ్యవస్థపై, ఆ వ్యవస్థని క్రియేట్ చేసిన బాస్ పై రివేంజ్ తీర్చుకోవాలని చూస్తాను. అయితే నా పాత్ర 'పఠాన్'లో జాన్ అబ్రహం పాత్రకు సిమిలర్‌గా ఉందనిపిస్తుంది కదా అని అడగొచ్చు. విచిత్రంగా 'పఠాన్' కూడా ముగ్గురు ఏజెంట్స్‌కి సంబంధించిన కథే. ఏజెంట్ కథకి 'పఠాన్' కథతో పోలిక లేదు.
హీరో అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ 'ఏజెంట్'. ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే ట్రెమండస్ రెస్పాన్స్‌తో భారీ అంచనాలని పెంచింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో 'ఏజెంట్'లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ కథానాయకుడు డినో మోరియా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
'ఇందులో నేను 'రా' ఏజెంట్ పాత్ర పోషించాను. ప్రత్యేక శిక్షణ తీసుకున్న పవర్ఫుల్ ఏజెంట్‌ని. అయితే వ్యవస్థలో నాకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థకు ఎదురు తిరిగి, వ్యవస్థపై పగ తీర్చుకునే పాత్ర నాది. దీంతో ఈవిల్‌గా మారిపోతాను. నాలో చాలా మ్యాడ్నెస్ ఉంటుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ కథ విన్నప్పుడే చాలా నచ్చేసింది. తెలుగులోకి రావడానికి ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అని డిసైడ్ అయ్యాను. ఇది ముగ్గురు ఏజెంట్స్ కథ. ఇందులో నేను విలన్‌గా మారడానికి కూడా ఒక కారణం ఉంటుంది. కథలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇరవై ఏళ్ల క్రితం 'ప్రియరాలు పిలిచింది' సినిమాలో మమ్ముట్టితో కలిసి పని చేశాను. మళ్ళీ ఇన్నాళ్ళుకు ఆయనతో కలసి చేయడం గొప్ప అనుభూతి. ఇందులో ఆయనికి ఎదురుతిరిగే పాత్ర చేశాను. అది పెద్ద సవాల్‌గా అనిపించిది. రామ్‌చరణ్ నా ఫ్రెండ్. ఆయన ద్వారా అఖిల్‌ని ఒకసారి కలిశాను. అదే అఖిల్‌ని 'ఏజంట్' సెట్లో చూసి ఆశ్చర్య పోయాను. చాలా అద్భుతంగా కనిపించాడు. తన లుక్ మొత్తం మార్చేశాడు. తన డెడికేషన్‌కి హ్యాట్సాఫ్. రెండున్నర గంటల సినిమాని ప్రేక్షకులు ఆద్యంతం ఎంజారు చేస్తారు. ఏజెంట్ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. మలుపులు, లార్జ్ యాక్షన్, విజువల్స్, సౌండ్ అన్నీ ప్రేక్షకులను అలరిస్తాయి.