Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటించింది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కథానాయిక డింపుల్ హయతి 'రామబాణం' చిత్ర విశేషాల గురించి మంగళవారం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ..
ఇందులో ఎలా సెలెక్ట్ అయ్యారు?
- 'కిలాడీ' సినిమా చేస్తున్నపుడే ఈ సినిమాకి సైన్ చేశాను. అయితే అందులో చాలా గ్లామరస్‌గా కనిపించాను. ఆ సినిమా చూసిన తర్వాత దర్శకుడు శ్రీవాస్ ఎందుకో తాను అనుకున్న 'భైరవి'లా అనిపించడం లేదనే డౌట్ వ్యక్తం చేశారు. అందుకే రెండుసార్లు స్క్రీన్ టెస్ట్ చేసి, భైరవి పాత్రకు నేను సరిపోతాననే నమ్మకం కుదిరిన తర్వాతే ఎంపిక చేశారు.
మీ పాత్ర తీరు ఎలా ఉంటుంది?
- ఇందులో అర్బన్ అమ్మాయిగా కనిపిస్తా. నా పాత్ర పేరు భైరవి. వ్లాగర్. నిజ జీవితంలో నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. కాబట్టి ఈ పాత్ర నాకు కొత్తగానే అనిపించింది. రీల్స్, వ్లాగ్స్ చేయడంలో ఫన్ జనరేట్ అయ్యింది. ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్‌లు ఉన్నారు. వారందరితో కలిసి వ్లాగ్ చేయాలి, ఇది చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. నా పాత్రపరంగానే కాదు మొత్తంగా 'రామబాణం' అందరినీ అలరించే ఎంటర్టైనర్.
గోపీచంద్‌తో పని చేయడం ఎలా అనిపించింది ?
- గోపీచంద్ చాలా తక్కువగా మాట్లాడతారు. పొద్దున్న హారు అంటే సాయంత్రం బారు.. దట్సాల్. నేనూ తక్కువగానే మాట్లాడతాను. అయితే పని పట్ల ఆయన చాలా ఫోకస్డ్గా ఉంటారు. సీన్ సరిగ్గా రాకపోతే ఆయన కళ్ళలోనే అర్థమైపోతుంది. చాలా కంపోజ్డ్గా మాట్లాడతారు. నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్.
జగపతి బాబు, కుష్బూ లాంటి సీనియర్ నటీనటుల నుంచి ఏం నేర్చుకున్నారు?
- 'రామబాణం' సెట్లో ఎప్పుడూ కనీసం ఓ పది మంది ఆర్టిస్ట్‌లతో కళకళలాడుతూనే ఉండేది. ఈ ప్రయాణంలో కుష్బూ నాకు సెకండ్ మదర్ అయిపోయారు. సెట్లో ఆవిడ అనుభవాలన్ని పంచుకున్నారు. అలాగే జగపతి బాబు కూడా. అందుకే ఈ సినిమా నాకు గ్రేట్ జర్నీ.
దర్శకుడు శ్రీవాస్‌తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి?
- శ్రీవాస్ స్వీట్ పర్సన్. చాలా అల్లరి చేస్తారు (నవ్వుతూ). ఆయన ప్రతీదీ చాలా వివరంగా చెప్తారు. నా పాత్రకి సంబధించిన ప్రతి డీటైల్‌ని ముందే చెప్పి.. సలహాలు, సూచనలు ఇచ్చారు. అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల గురించి ఏం చెబుతారు?
- విశ్వప్రసాద్, వివేక్ గ్రేట్ ప్రొడ్యుసర్స్. సినిమాకి కావాల్సిన ప్రతీదీ సమకూరుస్తారు. వారి నిర్మాణంలో మరోసారి పని చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెండు పెద్ద సినిమాలు చేస్తున్నాను. వాటి గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తాను. ఇప్పటికే తమిళంలో ప్రభుదేవా, విశాల్‌తో, అలాగే బాలీవుడ్ సినిమా 'అతరంగిరే'లో నటించాను. నాకు ఇతర భాషల్లో ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం.