Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. 'సత్యభామ, నేను లోకల్, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు' వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ఫుల్ నిర్మాతగా గుర్తింపు పొందిన ఆయన బర్త్‌డే నేడు (గురువారం).
ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
'్టనిర్మాతగా బిజీగా ఉండటమే ఈ పుట్టినరోజు ప్రత్యేకత. 2006లో అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలిచిత్రం 'టాటా బిర్లా మధ్యలో లైలా' విడుదలై, సక్సెస్‌ను అందుకున్నాను. అక్కడి నుంచి ఈ 16 సంవత్సరాల్లో నిర్మాతగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. దిల్‌రాజుతో నా ప్రయాణం కంటిన్యూ చేస్తాను.
ఆయన జడ్జిమెంట్‌పై నాకు ఎంతో నమ్మకం ఉంది. సినిమా పరిశ్రమలో నిర్మాత పరిస్థితి ఎప్పుడూ క్లిష్ట పరిస్థితే.. సినిమా మీద నాలెడ్జ్ వున్న వాళ్లు, అనుభవం వున్న నిర్మాతలు తీసిన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ. అనుభవంతో పాటు సినిమా మీద అంకితభావం ఉండాలి. అప్పుడే నిర్మాతగా సక్సెస్ సాధిస్తారు. అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కథ కంటే కాంబినేషన్ నమ్ముకుని ఎక్కువ సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దాని వల్ల సినిమా సూపర్‌హిట్ అయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్ నమ్ముకుని పారితోషికాలు భారీగా పెంచడం వల్ల సినిమాల బడ్జెట్ కూడా ఊహించని స్థాయికి పెరిగిపోతోంది. ప్రస్తుతం 'రోటి, కపడ, రొమాన్స్', నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి, సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా, అవికాగోర్‌తో ఓ క్రేజీ థ్రిల్లర్ చేస్తున్నాం. 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండుతో సినిమా చేస్తాను' అని చెప్పారు.