Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రియా ప్రధాన పాత్ర ధారిణిగా నటించిన చిత్రం 'మ్యూజిక్ స్కూల్'.
ముంబైలో ఈ చిత్ర ట్రైలర్ వేడుక ఘనంగా జరిగింది. దర్శక, నిర్మాత పాపారావు బియ్యాల, శ్రియా శరణ్, శర్మన్ జోషి, గ్రేసీ గోస్వామి, ఓజు బారువా ఈ వేడుకకి హాజరయ్యారు. ట్రైలర్‌ని హీరో విజరు దేవరకొండ డిజిటల్‌గా ఆవిష్కరించారు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన సినిమా ఇది. చక్కటి సంగీతం, ఆసక్తికలిగించే డ్రామా, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు, వినోదాన్ని పంచే దశ్యాలతో ట్రైలర్ అందర్నీ అలరిస్తోంది. ఈ సినిమాలో శ్రియా శరణ్, శర్మన్ జోషి సంగీత, నత్య టీచర్లుగా నటించారు. నేటి తరం విద్యార్థుల మీద తల్లిదండ్రులు, గురువులు, సమాజం మోపుతున్న ఒత్తిడిని సున్నితంగా, అర్థవంతంగా, సంగీత ప్రధానంగా చెప్పే ప్రయత్నమే 'మ్యూజిక్ స్కూల్'. ఈ సినిమాలో పదకొండు పాటలున్నాయి. భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇందులోని మూడు పాటలను, అత్యద్భుతమైన సౌండ్‌తో డిజైన్ చేశారు. అత్యద్భుతమైన ప్యాషన్‌తో ఫిల్మ్ మేకర్‌గా మారిన ఐఏయస్ ఆఫీసర్ పాపారావు బియ్యాల ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. యామిని ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని హిందీ, తెలుగులో తెరకెక్కించారు. తమిళంలోకి అనువదించారు. మే 12న పీవీఆర్ ద్వారా హిందీలో విడుదల చేస్తున్నారు. అలాగే తెలుగులో దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నారు.