Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ 'ఏజెంట్'. ఎకె ఎంటర్టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమా మాకు చాలా ప్రతిష్టాత్మకం. అందుకే దీని విషయంలో ఎగ్జైమెంట్ ఉంది. అలాగే ఒత్తిడి కూడా ఉంది. అయితే ఒత్తిడి మాత్రం ఫలితం గురించి కాదు. గత నెల రోజులుగా రాత్రి, పగలు యూనిట్ అంతా పని చేస్తోంది. చాలా పెద్ద సినిమా. గంటన్నర సీజీ వర్క్. ప్రతి ఫ్రేమ్‌లో సీజీ ఉంటుంది.
పైగా ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా. స్పై సినిమా అనగానే అవుట్ డోర్ ఉంటుంది. అన్నీ ఫారిన్ లోకేషన్స్. యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ షూటింగ్, ఎడిటింగ్ చేసిన తర్వాత మార్పులు వస్తే చాలా కష్టం. మామూలు ఎంటర్టైనర్స్, డ్రామా మూవీలలో చిన్న చిన్న తప్పులు ఉంటే సర్దుకుపోవచ్చు. కానీ ఏజెంట్లాంటి మూవీకి అది కుదరదు. ఈ సినిమా కథ అందరికీ నచ్చే పాన్ ఇండియా కంటెంట్. పాన్ ఇండియా విడుదలకు కనీసం మూడు నెలలు సమయం ఉండాలి. కాబట్టి మొదట తెలుగుపై ఫోకస్ చేసి, సెకండ్ వీక్ నుంచి అటు వైపు ప్లాన్ చేసే అలోచన ఉంది. ఇప్పటికే డబ్బింగ్ అంతా పూర్తయింది. ఇదొక యాక్షన్ ఫిల్మ్. కథ భిన్నంగా ఉంటుంది. ముగ్గురు రా ఏజెంట్స్ మధ్య జరిగే కథ. ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయి. అఖిల్‌కి.. బిఫోర్ ఏజెంట్, ఆఫ్టర్ ఏజెంట్లా ఉంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్‌గా, ఆశ్చర్యపరుస్తాయి. గొప్ప థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే చిత్రమిది. అంతేకాదు ఏజెంట్ క్యారెక్టర్లో ఫన్ ఉంటుంది. ట్రైలర్లో చూసే ఉంటారు. ప్రతీది ఎంజారు చేస్తుంటాడు. ప్రస్తుతం దర్శకుడిగా ఓ స్పై జోనర్ సినిమా చేస్తున్నాను. అలాగే మా 14 రీల్స్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. భోళా శంకర్‌కి సంబంధించి యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్ట్ 11న విడుదల చేస్తాం' అని తెలిపారు.