Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి దగ్గర్నుంచి దీనిపై పలు రూమర్లు సోషల్ మీడియా వేదికగా షికార్లు చేస్తున్నాయి. మహేష్, త్రివిక్రమ్ మధ్య గొడవ జరగడం కారణంగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు రావడంతో మహేష్‌బాబు ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో వీటిపై ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. 'అటెన్షన్ కోసం కావాలనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు. వీటిని చూసి నవ్వుకోవాలి. లేదంటే పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అభిమానులందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఇది పక్కా బ్లాక్‌బస్టర్ సినిమా. ఈ స్టేట్మెంట్ని మర్చిపోకండి' అని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నారు.