Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హైదరాబాద్ అంటే బిర్యానీ, ఇరానీ చాయ్‌కే కాదు... గొప్ప ప్రేమకు నిలయం' అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యునికేషన్ సంయుక్తంగా నిర్వహించిన 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 'సినిమా ద్వారా మంచి మార్పును తీసుకొచ్చేలా ఉండాలి. ఇవాళ తీసిన సినిమా మరో పదేళ్లైనా చూసేలా ఉండాలి. పిల్లలతో కలిసి చూసేలా ఉండాలి. డాక్యుమెంటరీ, ఫిల్మ్ ఏది తీసినా, ఎక్కడ పోస్టు చేసినా దిగువ స్థాయిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎంపథితో చూడాలి. విద్యార్థులు మీరు ఏం కల కంటున్నారో వాటిని సాధించేందుకు కృషి చేస్తే గొప్పవాళ్లు అయినట్టే' అని చెప్పారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ సహా ఇతర విభాగాలలో విజేతలుగా నిలిచిన 13 మందికి శేఖర్ కమ్ముల ట్రోఫీతోపాటు సర్టిఫికెట్లను అందజేశారు.