Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీసీ క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ చంద్ర నిర్మాతగా వరుణ్.కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భోగి'. సస్పెన్స్ కథాంశంతో, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపు కుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్, నిర్మాత డీఎస్‌రావు, నటులు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ విడుదల చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ మాట్లాడుతూ,'ఈ రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సంఘటలను వివరిస్తూ, సున్నితమైన ఆంశాలను నలుగురు మహిళలు ఏ విధంగా ఎదుర్కొన్నారు అనే థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం' అని తెలిపారు.
'చిన్న చిత్రమైనా మంచి క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. ఒక మంచి చిత్రాన్ని చూసిన అనుభూతిని మీకు తప్పకుండా ఈ చిత్రం కలిగిస్తుంది. అతి త్వరలో ట్రైలర్‌ను, ఆ తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తాం' అని నిర్మాత ప్రదీప్ చంద్ర అన్నారు. ప్రార్ధన, రాజ్యలక్ష్మి, శృతి, సిరి సిద్దు సతీష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కారె సతీష్, సంగీతం: ప్రదీప్ చంద్ర, ఎడిటర్: సూర్య, సుహాస్ రాయుడు, సహ నిర్మాత: కేవీ కనకేశ్వర రావు, సాహిత్యం: స్వాతి కిరణ్, రాజేష్ లోకనాధం, అఫీషియల్ స్పాన్సర్ : లలిత జ్యూవెలరీస్.