Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాంది' వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఉగ్రం'. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'ఉగ్రం' విశేషాల గురించి దర్శకుడు విజయ్ కనకమేడల శనివారం మీడియాతో ముచ్చటించారు. 'నరేష్ ఇప్పటివరకు ఎమోషన్స్ చేశారు. కానీ పూర్తి రౌద్ర రసంతో చేయలేదు. ఇది ఆయనకి కొత్తగా ఉంటుందనిపించి, కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఈ కథకి స్ఫూర్తి నిత్యం కనిపిస్తున్న మిస్సింగ్ వార్తలే. తెలంగాణ హైకోర్టు కోర్టు కూడా మిస్ అవుతున్న వారు ఏమౌతున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు డిపార్ట్మెంట్ని కోరినట్లు ఒక ఆర్టికల్ చదివాను. ఈ అంశంపై, తప్పిపోతున్న వారి కుటుంబ సభ్యుల్లో బాధ ఎలా ఉంటుందనేదానిపై కథ ప్రిపేర్ చేశాం.
ఈ కథని తూమ్ వెంకట్ కథ అద్భుతంగా రాశారు. నరేష్ ఇందులో ఒక పోలీస్ అధికారి పాత్ర కాబట్టి యాక్షన్‌లోకి వెళ్ళాల్సివచ్చింది. ఉగ్రం మంచి యాక్షన్ థ్రిల్లర్. కథానుగుణంగా ఇందులో యాక్షన్స్ సీక్వెన్స్ ఎక్కువే ఉంటాయి. అన్నీ చాలా బాగా వచ్చాయి. ప్రతి సీక్వెన్స్‌లోనూ ఎమోషన్ ఉంటుంది. హీరో ఫైట్ చేస్తే దానికి ఒక కారణం కూడా తప్పని సరిగా ఉంటుంది. ఆ ఎమోషన్ని ప్రేక్షకులు కూడా ఫీలౌతారు. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ సర్ప్రైజ్ చేస్తాయి. ఇందులో కాలేజ్ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా మూడు భిన్నమైన కోణాల్లో మీర్నా మీనన్ చాలా చక్కగా చేసింది. మా షైన్ స్క్రీన్స్ నిర్మాతల గురించి ఎంత చెప్పినా తక్కువే. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా క్యాలిటీ కోసం చాలా సపోర్ట్ చేశారు. 'ఉగ్రం'పై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని అందుకుంటాం' అని విజయ్ తెలిపారు.