Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'కళ్యాణమస్తు'. ఒ.సాయి దర్శకత్వంలో బోయపాటి రఘుబాబు నిర్మించిన ఈ సినిమాను మే 12 రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శివబాలాజీ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రెజెంట్ చేసారు. అద్భుతమైన విజువల్స్‌తో, క్యూట్ లవ్ స్టొరీతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
'ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్‌కి ప్రేక్షకులు నుండి మంచి స్పందన వచ్చింది. మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని దర్శకుడు ఒ.సాయి అన్నారు. హీరో శేఖర్ వర్మ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో ఆడియన్స్ కోరుకునే ప్రతి ఎమోషన్ ఉంది. కామెడీ, డ్రామా, యాక్షన్, స్టొరీ, నా గత సినిమాలతో పోల్చుకుంటే నా మేక్ ఓవర్ చాలా బాగుంటుంది. కచ్చితంగా అందరూ ఈ సినిమా చూసి ఆదరించాల్సిసిందిగా కోరుకుంటున్నాను' అని చెప్పారు. హీరోయిన్ వైభవి రావ్ మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ చాలా కష్టపడి పని చేశారు. కచ్చితంగా మీరందరూ సినిమాని చూసి విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్: మల్లికార్జున్ నారగని, సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్.