Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెజాన్ స్టూడియోస్, స్కైడ్యాన్స్ స్పోర్ట్స్, ఆర్టిస్ట్స్ ఈక్విటీ, మాండలే పిక్చర్స్ రూపొందించిన 'ఎయిర్' చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఈనెల 12 నుంచి ఇండియాలో ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. అవార్డులు గెలుచుకున్న డైరెక్టర్ బెన్ ఎఫ్లెక్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర కథ ఎయిర్ జోర్డన్ బ్రాండ్‌తో ప్రపంచ క్రీడలను, సమకాలీన సంస్కతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నైకీకి చెందిన అప్పటి బాస్కెట్ బాల్ డివిజన్‌కు చెందిన మైకేల్ జోర్డన్‌కు చెందిన నమ్మశక్యం కాని ఆటను మలుపు తిప్పిన భాగస్వామ్యాన్ని వెల్లడిస్తుంది. అన్నింటినీ పాటిస్తూ సంప్రదాయన్ని ధిక్కరించేలా సాగే ఆట అందర్ని కదిలిస్తుంది.
తన కుమారుడిలో ఉన్న అద్భుత నైపుణ్యం గురించి ఏ మాత్రం రాజీపడని తల్లి, చరిత్రలో నిలిచిపోయిన దిగ్గజ బాస్కెట్ బాల్ ఆటగాడి కథ ఇది.
మ్యాట్ డ్యామన్ నటించిన ఈ చిత్రాన్ని బెన్ఎఫ్లెక్ దర్శకత్వం వహించడం ఇదే మొదటిసారి. అలెక్స్ కన్వరీ స్క్రిప్ట్ రాసిన ఈ చిత్రాన్ని డేవిడ్ ఎలిసన్, జెస్సీ సిస్గోల్డ్, జాన్ వెయిన్బాచ్, ఎఫ్లెక్, డ్యామన్, మ్యాడిసన్ ఐన్లీ, జెఫ్ రాబినోవ్, పీటర్ గూబర్, జాసన్ మైకేల్ బెర్మన్ నిర్మించారు. అమోజన్లో సైతం ఈ సినిమా వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందనే దీమాతో ఉన్నారు.