Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో (సుమారు రూ.80 కోట్లు) రూపొందిన చిత్రం 'ఏజెంట్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్‌రెడ్డి 2 పతాకాలపై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ అపజయాన్ని చవిచూసింది. విడుదలైన తొలి రోజు తొలి షో నుంచే సర్వత్రా ఈ సినిమా డిజాస్టర్ అనే టాక్ వచ్చింది. అసలు కథ లేకుండానే సినిమా తీశారని, అలాగే 'రా' ఏజెంట్ల పని తీరుపై ఏ మాత్రం అవగాహన లేకుండా సన్నివేశాలను చిత్రీకరించడం హాస్యాస్పదమని.. అన్నింటికీ మించి అఖిల్ లాంటి హీరో స్థాయిని మించి భారీ బడ్జెట్ పెట్టారని.. ఇలా ఈ చిత్రంపై సోషల్‌మీడియా వేదికగా కామెంట్ల మీద కామెంట్లు వెల్లువెత్తాయి. వీటికి నిర్మాత అనిల్ సుంకర స్పందిస్తూ ''ఏజెంట్' ఫలితం విషయంలో పూర్తి బాధ్యత మాదే. పెద్ద టాస్క్ అని తెలిసినా దాన్ని సాధించగలమనే నమ్మకంతో ఈ సినిమా చేశాం. అయితే అది ఫెయిల్ అయింది. బౌండెడ్ స్క్రిప్ట్ పక్కాగా రెడీ కాకముందే సినిమా ప్రారంభి పెద్ద తప్పు చేశాం. మధ్యలో కోవిడ్ సహా పలు సమస్యలు వచ్చాయి. అయితే సినిమా ఫలితం విషయంలో ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. ఈ కాస్ట్లీ మిస్టేక్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఈ తరహా తప్పులు పునరావృతం కాకుండా ఏం చేయాలో చూస్తాం. మాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న వారికి క్షమాపణలు చెబుతున్నాను. తదుపరి ప్రాజెక్టుల్లో ఆ లోటును భర్తీ చేస్తామని ప్రేక్షకులకు మాట ఇస్తున్నాను' అని ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.