Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదేళ్ల కష్టం బలగంతో ఫలించిందని నటుడు సంజయ్కృష్ణ చెప్పారు. ఈనెల 5న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సంజయ్కృష్ణ మాట్లాడుతూ, 'అమెరికాలో ఎంబీఏ చేసి, ఇండియాలో ఎల్ఎల్బీ చేశా. నటుడిగా చేసిన ప్రయత్నాల్లో తొలిసారి 'కాళి చరణ్'లో ఛాన్స్ వచ్చింది. తర్వాత 'అప్పట్లో ఒకడుండెవాడు'లో మంచి క్యారెక్టర్ రావడంతో 'కాటమ రాయుడు'లో నటించే ఛాన్స్ వచ్చింది. 'ఆచార్య, గని, అఖండ, భీమ్లానాయక్'.. అలా మొత్తం 32 సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. కానీ 'బలగం' పెద్ద హిట్ కావడంతో ఇన్నేళ్ల కష్టం ఫలించింది. ఈ మూవీ తర్వాత నాలుగైదు ప్రాజెక్ట్లు లైన్లో ఉన్నాయి. అలాగే ప్రస్తుతం నాగశౌర్య 'రంగబలి'లోనూ నటిస్తున్నా' అని చెప్పారు.