Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈనెల 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు మీడియాతో మాట్లాడుతూ, ''రామబాణం' ఒప్పుకోవడానికి కారణం ఇప్పుడన్నీ హారర్, యాక్షన్, థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. అలాగే గోపీచంద్, శ్రీవాస్, నేను కలిసి 'లక్ష్యం' చేశాం.దీంతోపాటు ఇందులో అన్నదమ్ముల కాన్సెప్ట్ అద్భుతంగా కుదిరింది. ఇది చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా. హాయిగా ఓ మంచి సినిమా చూసామనే అనుభూతినిస్తుంది. పాత్ర పరంగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఎందుకంటే ఇప్పటి వరకూ దాదాపు 70కి పైగా క్యారెక్టర్ రోల్స్ చేశాను. అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏడెనిమిది సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 'లెజెండ్', 'అరవింద సమేత', 'రంగస్థలం' చేసిన పాత్రలు చాలా తృప్తినిచ్చాయి. కొన్ని సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు మోస్ట్ కంఫర్ట్బుల్ ప్రొడ్యూసర్స్. సెకండ్ ఇన్నింగ్స్‌లో మార్కెట్, స్టార్ డమ్ పెరిగాయి. అలాగే నా జీవితమే పెరిగింది.(నవ్వుతూ) పాత్రల పరంగా గాడ్‌ఫాదర్, అలాగే 'గాయం'కు మరో స్థాయిలో ఉండే పాత్ర చేయాలని ఉంది' అని అన్నారు.