Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామెడీ పాత్రలు చాలా సునాయాసంగా చేసిన నాకు యాక్షన్ రోల్స్ చేయడం సవాల్‌గా అనిపించింది. అయితే క్రిష్ 'గమ్యం', సముద్రఖని 'శంభో శివ శంభో' ఇప్పుడు విజయ్ 'నాంది, ఉగ్రం'తో వచ్చింది. నన్ను దర్శకుడు నమ్మితే దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఇంత ఇంటెన్స్ రోల్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ క్రెడిట్ అంతా విజయ్‌కి వెళ్తుంది' అని హీరో నరేష్ అన్నారు.
'నాంది' వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, డైరెక్టర్ విజరు కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ 'ఉగ్రం'తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మిర్నా మీనన్ నాయిక. ఈనెల 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అల్లరి నరేష్ మీడియాతో ముచ్చటించారు.
'ఇందులో మూడు వేరియేషన్స్‌లో ఉండే పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్ర ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యాంగ్రీ మ్యాన్ పాత్రలో నన్ను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని అర్థమైంది. ఇందులో యాక్షన్ సహజంగా ఉంటుంది. దర్శకుడు విజయ్ ఏం కావాలో చాలా క్లారిటీగా తెలుసు. ఈ సినిమాలో తాను అనుకున్నది డెలివర్ చేశాడు. మీర్నా, కూతురుగా నటించిన ఊహా అద్భుతంగా చేశారు. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ఇది నా 60వ సినిమా. ఇన్ని సినిమాలు కేవలం ప్రేక్షకుల ఆదరణ వల్లే సాధ్యమైంది. దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. కానీ దానికి చాలా సమయం ఉంది. నాన్న (ఇవివి) చివరి రోజుల్లో అలీ బాబా అరడజను దొంగలకి సీక్వెల్‌గా అలీ బాబా డజను దొంగలు చేద్దామని అనుకున్నాం' అని నరేష్ చెప్పారు.