Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసక్తికరమైన కథతో రూపొందిన చిత్రం 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో'. ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును అనేది ఉపశీర్షిక. పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లో వస్తోన్న 6వ చిత్రమిది.
'30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్గా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో విడుదలైన మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ లిరికల్ సాంగ్‌ను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా విడుదల చేశారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ ఆల్బమ్‌లోని సెకండ్ సాంగ్‌ను నేను విడుదల చేశాను. ఫార్మల్గా బావుందని చెబుతారు. కానీ ఈ పాట నిజంగా చాలా బావుంది. మళ్లీ మళ్లీ వినాలని ఉంది. సినిమాకు మంచి వైబ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ అద్భుతమైన సౌండింగ్ చేశారు. పాటలో మంచి క్వాలిటీ కనిపిస్తోంది. నేను కొన్ని విజువల్స్ చూశాను. యాక్టింగ్ పరంగా చైతన్య, లావణ్య ఇరగదీశారు' అని చెప్పారు. హీరో చైతన్య రావు మాట్లాడుతూ, 'ఈ సినిమాలోని రెండవ పాట 'వెన్నెల్లో ఆడపిల్ల..' నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఫస్ట్ సాంగ్ 'రంగమ్మ..' చాలా వైరల్ అయింది. ఈ సెకండ్ సాంగ్ అంతకంటే ఎక్కువ వైరల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు చెందుముద్దు గారికి ధన్యవాదాలు. బిగ్ బెన్ బ్యానర్ ద్వారా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి కొత్త టాలెంట్‌కు ఇంత మంచి అవకాశం ఇచ్చిన యశ్ రంగినేనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం' అని తెలిపారు.
'మొదట వచ్చిన రంగమ్మ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అందరూ ఆ పాటకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు రెండో పాటగా వెన్నెల్లో ఆడపిల్ల వస్తోంది. మొదటి పాట రంగమ్మ ఎంత నచ్చిందో.. ఈ వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ కూడా మీకు అంతే నచ్చుతుంది. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ. అలాగే శ్రీనివాస్ రంగమ్మ సాంగ్ లాగానే అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ విజువల్స్ మీకు బాగా నచ్చుతాయి' అని హీరోయిన్ లావణ్య అన్నారు.
ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు నటిస్తున్నారు.దీనికి సంగీతం - ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ - పంకజ్ తొట్టాడ, ఎడిటర్ - డి వెంకట్ ప్రభు, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత - యష్ రంగినేని, రచన దర్శకత్వం - చెందు ముద్దు.