Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఎన్.శివకళ్యాణ్ దర్శకత్వంలో హొఎమ్డి అసీఫ్ జానీ నిర్మిస్తోన్న చిత్రం 'తురుమ్ ఖాన్లు'. శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, హొసీతాపులి, ఐశ్వర్య ఉల్లింగల, శ్రియాంక, విజయ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ఆవిష్కరణ శ్రీ సత్య సాయి నిగమాగమంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకులు వి.సముద్ర మోషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ, 'నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. దర్శకుడు చెప్పిన మంచి కథని అనుకున్న విధంగా తెరకెక్కించారు. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. జూన్లో సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తాం' అని తెలిపారు. 'పల్లెటూరి నేపథ్యంలో సాగే రివేంజ్ కామెడీ డ్రామా చిత్రమిది. సినిమా చాలా అల్లరల్లరిగా ఉంటూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇందులో 4 అద్భుతమైన పాటలు ఉన్నాయి.
త్వరలో పాటలను రిలీజ్ చేస్తాం' అని దర్శకుడు ఎన్.శివ కళ్యాణ్ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూ టీవ్ ప్రొడ్యూసర్ : దేవరాజ్ పాలమూర్, కో-ప్రొడ్యూసర్ : కె.కళ్యాణ్ రావ్.