Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం 'అన్నీ మంచి శకునములే'. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ మీడియాతో మాట్లాడారు.
ఒక మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. వేసవిలో మన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి ఓ పది రోజులు హాయిగా గడిపి వస్తే ఆ జ్ఞాపకం ఎలా ఉంటుందో..ఈ సినిమా అలా ఉంటుంది. ఈ సినిమా అంతా కునూర్ హిల్ స్టేషన్లో జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నందిని క్రియేట్ చేసిన టౌన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ చిన్న ప్రపంచంలోకి తీసుకెళుతుంది.కథాను గుణంగా ఇందులో గౌతమీ, ఊర్వశి లాంటి నటీమణులు ఉన్నారు. సంతోష్ శోభన్ లాంటి హీరోతో చేసినప్పుడు ఎలాంటి కాలిక్యులేషన్ వేసుకోం. నాన్నగారు 50 ఏళ్ళుగా ఇండిస్టీలో నిలబడ్డారు. ఈ రోజు ఆయన పిల్లలు సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏ రోజు లెక్కలు వేసుకోలేదు. బహుశా అదే మాకూ వచ్చింది. ఈ సినిమా చూసినప్పుడు మీకే అనుభవంలోకి వస్తుంది. ఒక మంచి జ్ఞాపకం లాంటి ఎమోషన్, ఆనందం వస్తే కంటి తడి పెట్టె ఎమోషన్. ఎమోషన్స్ అన్నీ చాలా సెటిల్డ్‌గా ఉంటాయి. నందిని రెడ్డి సినిమాల పంథాలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మా వైజయంతి వచ్చిన క్లాసిక్స్‌లో 'జగదీక వీరుడు అతిలోక సుందరి'కి పార్ట్ 2 చేయాలనేది మా కోరిక. మాకు నచ్చి, ముచ్చట పడి చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చడం అదృష్టం.