Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బిచ్చగాడు' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2'తో ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందడం విశేషం. ఈ సినిమా గురించి ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని నాకు బాగా తెలిసిన ఉషా పిక్చర్స్ వారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఫస్ట్‌పార్ట్‌లో అద్భుతమైన పాయింట్‌తో వచ్చారు. ఆ టైమ్‌లో ఈ సినిమా అన్ని బంధాలను బాగా గుర్తు చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి సెంటిమెంట్‌తోనే ఈ చిత్రం వస్తున్నట్టు కనిపిస్తోంది' అని తెలిపారు.
''బిచ్చగాడు 2 బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. పార్ట్ 1లో చూసిన దానికంటే లార్జర్ స్కేల్లో సెకండ్ పార్ట్‌లో చూస్తారు. మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు. ఈసారి సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు. ఈ 19న మీరంతా ఫ్యామిలీస్‌తో వచ్చి థియేటర్స్‌లో సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని విజయ్ ఆంటోనీ చెప్పారు.