Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కంజర గ్రామానికి చెందిన యువకుడు విరాజ్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం 'గాడ్'. ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రివ్యూ ఈవెంట్లో టిఎస్‌ఆర్‌టిసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక, సభ్యులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ కుటుంబ సమేతంగా వీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించి, నూతన హీరో విరాజ్ రెడ్డిని ప్రోత్సహించాలి. అను ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ జాగా పెద్ది పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, చైనీస్, భాషలలో తెరకెక్కించారు' అని తెలిపారు. ''గాడ్' చిత్రంలో నటించిన కళాకారులు, పని చేసిన సాంకేతిక నిపుణులకు టిఎస్ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమాలపై మక్కువ ఉన్న విరాజ్ రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రజలందరూ వీక్షించి, ఈ చిత్రంలో నటించిన కళాకారులందరినీ ఆదరించాలని కోరారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు హర్రర్, కామెడీగా అనిపించిందని, మరోవైపు జరిగిన సంఘటన గురించి హీరో ఇన్వెస్టిగేషన్ చేసే విధానం ఎంతగానో నచ్చిందని ఆయన తెలిపారు. ఈ సినిమాకు ముందు విరాజ్ 'వన్ మాన్ ఆర్మీ' అనే సినిమా కూడా తీశారు. అది ఇంకా రిలీజ్ కాలేదు.