Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్మన్ జోషి, శ్రియా, షాన్, సుహాసిని మూలే, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మ్యూజిక్ స్కూల్'. ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మల్టీ లింగ్వువల్ మ్యూజికల్ మూవీ ఈనెల 12న రిలీజ్ అవుతుంది. శనివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. 'మ్యూజిక్ స్కూల్' జ్యూక్ బాక్స్‌ను ఇళయరాజా, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ,'పాటలు, ట్రైలర్‌ను చూస్తుంటే చక్కగా తెరకెక్కించారని తెలుస్తోంది. పాపారావు నాకు 16-17 ఏళ్లుగా తెలుసు. అస్సాంలో చీఫ్ ర్యాంక్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. ఆయన నన్ను కలిసి సినిమా తీశానని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నేటి సమాజంలో పిల్లల్లో ఉండే క్రియేటివిటీని ఎలా చంపేస్తున్నారనే అంశంపై ఈ సినిమా తీశారు. తెలంగాణలో ఇళయరాజా మంచి మ్యూజిక్ యూనివర్సిటీని లీడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను' అని తెలిపారు.
'మ్యూజిక్ నేర్చుకుంటే వయొలెన్స్ ఉండదు. మోసం ఉండదు. ప్రజల మధ్య స్నేహం పెరుగుతుంది. ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. కేటీఆర్ చెప్పినట్లు ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ వస్తే .. ఒకటి రెండు కాదు.. 200 మంది ఇళయరాజాలను మీనుంచి తయారు చేస్తాను. మన దేశం నుంచి విదేశాలకు వెళ్లి గొప్పగా సంగీతాన్ని ప్రదర్శించాలి. మన దేశంలో ఎంతో శక్తివంతమైన ప్రజలున్నారు. నేను దాన్ని రుజువు చేస్తాను. కెటీఆర్ రిక్వెస్ట్‌ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను' అని ఇళయరాజా చెప్పారు. చిత్ర దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ, 'నేషనల్ లెవల్లో పివిఆర్ రిలీజ్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. వారికి స్పెషల్ థ్యాంక్స్' అని చెప్పారు. 'ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్‌ను ఇస్తున్నారు. ఈ సినిమాను అన్నీ స్కూల్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించాలి' అని నిర్మాత దిల్ రాజు అన్నారు.