Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న ఫాంటసీ, అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ 'ఊరు పేరు భైరవకోన'. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. తాజాగా మేకర్స్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, 'నా బర్త్ డే రోజు టీజర్ విడుదల కావడం స్పెషల్ మూమెంట్. తొలిసారి చండీయాగం చేసి టీజర్ విడుదల చేయడం చాలా పాజిటివ్‌గా ఉంది. ఈ సినిమాలో చాలా మంచి విషయాలు, వినోదాత్మక విషయాలు ఉంటాయి. ఫాంటసీ అడ్వెంచర్ సినిమాలు నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. వర్ష బొల్లమ్మ, కావ్య.. ఇలా అందరూ చాలా చక్కగా నటించారు' అని తెలిపారు.
''ఊరు పేరు భైరవకోన' యూనిక్ కాన్సెప్ట్. అలాగే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. సూపర్ నేచురల్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. నిర్మాత రాజేష్ ఎక్కడా రాజీ పడకుండా పూర్తి సహకారం అందించారు. అనిల్ మొదటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నారు. వైవా హర్ష పాత్ర ఇందులో కీలకంగా ఉంటుంది. సినిమాని చాలా కొత్తగా ప్రయత్నించాం' అని దర్శకుడు విఐ ఆనంద్ అన్నారు.
సమర్పకుడు అనిల్ సుంకర మాట్లాడుతూ, 'టీజర్ సందీప్‌కి బర్త్ డే గిఫ్ట్ మాత్రమే కాదు బ్లాక్ బస్టర్ గిఫ్ట్ కూడా. దర్శకుడు చెప్పిన దానిలో 70 శాతం విజువల్స్ ఉంటే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ ఆనంద్ చెప్పిన దాని కంటే 50 శాతం ఎక్కువ విజువల్‌గా ఉంది. విజువల్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ప్రేక్షకులు కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు' అని చెప్పారు. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ, 'భారీ స్థాయిలో ఆనంద్ స్టైల్లో సూపర్ నేచురల్ ఫాంటసీగా ఈ సినిమా వస్తుంది. ఈ టీజర్ చూసి సినిమా రేంజ్ ఏమిటనేది మీరే చెప్పాలి. అనిల్ చాలా మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు' అని తెలిపారు.