Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కె. యల్. పి మూవీస్ పతాకంపై సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీనటులుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన చిత్రం 'ఐక్యూ' (పవర్ అఫ్ స్టూడెంట్స్). ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్బంగా చిత్ర యూనిట్ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నటుడు సుమన్ మాట్లాడుతూ,'చాలా కొత్త పాయింట్‌ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది' అని తెలిపారు. 'ఇది ఒక బ్రెయిన్‌కు సంబంధించిన సినిమా. మేధావి అయిన ఓ అమ్మాయి మెదడును అమ్మడానికి వాళ్ళ ప్రొఫెసర్ ఎలా ప్లాన్ చేశాడు అనే పాయింట్ ఇప్పటి వరకు రాలేదు. యూత్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మా అబ్బాయి హీరోగా నటిస్తున్నాడు' అని నిర్మాత కాయగూరల లక్ష్మీపతి చెప్పారు. దర్శకుడు శ్రీనివాస్ జి.యల్. బి మాట్లాడుతూ,' మంచి కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాకు మీరందరి సపోర్ట్ కావాలి' అని అన్నారు.