Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మిత్ర విందా మూవీస్తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. ఈనెల 18న విడుదల కానున్న సందర్భంగా ఈచిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి వాసుకి మాట్లాడుతూ, ''తొలిప్రేమ' తర్వాత దాదాపు 23 ఏళ్ళకి ఇందులో నటించడానికి కారణం ఒక్కటే ఈ కథ విన్న వింటనే సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ ఫీలయ్యాను. ఫ్యామిలీలో తమ్ముడు ఏం చేసినా సపోర్ట్ చేసే ఒక అక్క ఉంటుంది కదా. అలాంటి పాత్రే నాది. నాకు, సంతోష్ పాత్రకు చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఒక మంచి కథ చదువుతున్నప్పుడు ఎంత ఆనందంగా, హాయిగా ఉంటుందో.. ఈ సినిమా అలా ఉంటుంది' అని చెప్పారు.