Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌పై రూపొందిన తొలి చిత్రం 'కథ వెనుక కథ'. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా నటించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అవనీంద్ర కుమార్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని మే 12న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది' అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ, ''నేను ఇండిస్టీలోకి వచ్చి 30 ఏళ్లు అయ్యాయి. 80కిపైగా సినిమాలు చేశాను. మా నిర్మాత ప్యాషన్‌తో అన్ కాంప్రమైజ్డ్గా, మంచి కంటెంట్‌తో చేసిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది' అని అన్నారు.