Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'యూనివర్సిటీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈనెల 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో పాత్రికేయులకు ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మి నారాయణ వారణాసి, జనరల్ సెక్రెటరీ వై జే రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ, 'పేపర్ లీకేజ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో చాలా దారుణంగా జరుగుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా జరిగాయి. మరి నిరుద్యోగులు ఏమై పోవాలి?, విద్య, వైద్యం రెండు జాతీయం చేయాలని చెప్పేది నా సినిమా. లీకేజ్‌లను జాతీయ సమస్యగా పరిగణించాలి అని రాష్ట్రపతి, ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో 5 పాటలు ఉన్నాయి' అని చెప్పారు.