Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కిన తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ'. కృతి శెట్టి కథానాయికగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. పవన్‌కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు మీడియాతో
ఈ సినిమా గురించి పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. 'ఈ కథ ఆలోచనకు స్ఫూర్తి మలయాళం సినిమా 'నయట్టు'. పెద్ద ఆశయాలతో ఉన్న ఒక సాధారణ కానిస్టేబుల్ కథ చెప్పాలనేది ఆలోచన. అలా 'కస్టడీ' కథ పుట్టింది. 'లవ్ స్టొరీ'లో ఒక పాట చూశాను. అందులో నాగచైతన్య ఈ పాత్రకు సరిపోతాడని పించింది. నాగచైతన్యకు కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. అలాగే నిర్మాత శ్రీనివాస్ జాయిన్ అయ్యారు. ఇందులో హీరో శివ ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్. తనకి కుటుంబం, అలాగే ప్రేమగా కూడా ఉంటుంది. శివకి వచ్చిన సమస్యతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. తనది కాని సమస్య తను ఎదురుకోవాల్సి వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ సినిమా ఎడ్జ్ అఫ్ సీట్ థ్రిల్లర్‌లా ఉంటుంది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందరూ ఎంజారు చేసేలా, స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఫేస్డ్గా ఉంటుంది. అరవింద్ స్వామి ఇమేజ్‌కి తగ్గట్టుగా ఆయన పాత్ర ఉంటుంది. స్క్రీన్ పై చై కంటేపవర్ ఫుల్‌గా కనిపించే వ్యక్తి కావాలనే ఆలోచనతో ఆయన్ని తీసుకున్నాం. అంత పవర్ ఫుల్ వ్యక్తిని ఎలా కంట్రోల్ చేస్తాడనే ఎగ్జైట్మెంట్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే శరత్ కుమార్ పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో కొత్త చైతూని చూస్తారు. అలాగే ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నెక్స్ట్ లెవల్లో మ్యూజిక్ చేశారు. కస్టడీకి మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్. చాలా యూనిక్ సౌండ్ వింటారు. ఇందులో కృతి పేరు రేవతి. చాలా అద్భుతంగా చేసింది. తన పాత్ర కథలో కీలకంగా ఉంటుంది.