Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది హీరోగా ఎస్.ఆర్.టి. మూవీ హౌస్, శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్ తలారి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లా డుతూ, ''ఆది కెరీర్లో 'చుట్టాలబ్బాయి' ఒక డిఫరెంట్ చిత్రమవు తుంది. మలయాళ హీరోయిన్ నమిత ప్రమోద్ ఈ చిత్రంలో ఆది సరసన నటిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం' అని అన్నారు. ''ప్రేమకావాలి', 'లవ్లీ' వంటి సూపర్‌హిట్ చిత్రాలతో యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన 'లవ్లీ' రాక్‌స్టార్ ఆది హీరోగా, 'అహనా పెళ్లంట', 'పూలరంగడు' వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వీరభద్రమ్ దర్శకుడిగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను విజయదశమి రోజున ప్రారంభించడం ఆనందంగా ఉంది. మా బేనర్స్‌లో ఇదొక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమవుతుంది. వీరభద్రమ్ నెరేట్ చేసిన కథ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కర్నీ ఎంటర్టైన్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాతలు రాము తాళ్ళూరి, వెంకట్ తలారి తెలిపారు.
బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, అభిమన్యు సింగ్, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, గిరిధర్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: ఎస్.అరుణ్‌కుమార్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవాని ప్రసాద్.