Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్‌కళ్యాణ్ సరసన 'సర్దార్ గబ్బర్‌సింగ్'లో నటించే అవకాశాన్ని పొందిన రారులక్ష్మీ తాజాగా 'జూలీ2' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగిడబోతోంది. తన నటనతో దక్షిణాది ప్రేక్షకుల మన్ననలు పొందిన రారులక్ష్మీ ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లో 49 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం 50వ సినిమాగా 'జూలీ2'లో నటిస్తున్నారు. 2004లో దీపక్ దర్శకత్వంలో రూపొందిన 'జూలీ' చిత్రానికి సీక్వెల్‌గా, ఆయన దర్శకత్వంలోనే 'జూలీ2' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో 'రేసుగుర్రం'లో ప్రతినాయకుడుగా నటించిన భోజ్‌పురి నటుడు రవికిషన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 'జూలీ2' సెట్స్‌లో ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తీసిన వర్కింగ్ స్టిల్‌ను అభిమానులతో పంచుకునేందుకు రారులక్ష్మీ సోమవారం ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. '50వ చిత్రాన్ని బాలీవుడ్లో చేయడం థ్రిల్లింగ్‌గా ఉందని' రారులక్ష్మీ పేర్కొన్నారు.