Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆద్యంతం వినోదాత్మకంగా, థ్రిల్లింగ్ ఉన్న 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రం నాకు ఎంతో బాగా నచ్చింది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి ఎంజారు చేస్తారు' అని హీరో బాలకృష్ణ అన్నారు. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఇటీవల విడుదలైన నేపథ్యంలో తాజాగా హీరో బాలకృష్ణ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నాని బాగా నటించారు. సినిమాలో ఎంటర్టైన్ మెంట్ బాగుంది. రాయలసీమలోని లొకేషన్స్‌ని సినిమాటోగ్రాఫర్ యువరాజ్ అద్భుతంగా చిత్రీకరించారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా మంచి నిర్మాణ విలువలతో తీశారు. దర్శకుడు హను రాఘవపూడి సినిమాను థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. 'లెజెండ్' చిత్రాన్ని సందర్భానుసారంగా ఇందులో ఉపయోగిం చిన తీరు ఆకట్టుకుంది. నా ఫ్యాన్స్ బాగా ఎంజారు చేస్తున్నారు. పృథ్వీ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ పాత్రల కామెడీని బాగా ఎంజారు చేశాను' అని అన్నారు. 'ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్పెషల్ షోను వీక్షించి, మమ్మల్ని అభినందించిన బాలయ్యగారికి కృతజ్ఞతలు' అని చిత్ర నిర్మాతలు తెలిపారు.