Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో ఓ అరుదైన కాంబినేషన్ కలిసి ఒక సినిమాకు పనిచేయబోతున్నారు. సీనియర్ నటి షబానా అజ్మీ, ఆమె భర్త, పాటల రచయిత జావేద్ అక్తర్, షబానా సోదరుడు, సినిమాటోగ్రాఫర్ బాబా అజ్మీ కలిసి ఒకే సినిమాకు పనిచేయబోతున్నారు. ఉపాధ్యాయుల నేపథ్యంలో తెరకెక్కనున్న ఓ బాలీవుడ్ చిత్రంలో షబానా ప్రధాన పాత్రలో నటించనుండగా, భర్త జావెద్ అక్తర్ పాటలు అందించనున్నారు. సోదరుడు బాబా సినిమాటోగ్రఫీగా పనిచేయనున్నారు. ఒక అరుదైన కాంబినేషన్‌తో రూపొందే ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే బాలీవుడ్లో అంచనాలు పెరిగిపోయాయి. బాబా అజ్మీ 1982లో వచ్చిన షబానా చిత్రం 'అనోఖా బంధన్' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.