Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బెంగుళూరు డేస్' తమిళ వెర్షన్ రీమేక్‌లో నయనతార నటించనున్నట్లు సమాచారం. మళయాళంలో ఘనవిజయం సాధించిన 'బెంగుళూరు డేస్' చిత్రాన్ని ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో దిల్ రాజు, పివిపి సంయుక్తంగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్య, శ్రీదివ్య, బాబీ సింహా, రానా దగ్గుబాటి, పార్వతి, రారు లక్ష్మీ తదితరులు తమిళ వెర్షన్లో నటిస్తుండగా, వరుణ్ తేజ్, నిత్యా మీనన్, శర్వానంద్, రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు వెర్షన్లో నటిస్తున్నారు. నటాషా పాత్రలో నిత్య మీనన్ నటిస్తున్నట్లు వార్తలొచ్చినప్పటికీ, చివరిగా ఆ పాత్ర కోసం నయనతారని సంప్రదించినట్టు సమాచారం. కథ, పాత్ర రెండు నచ్చడంతో నయనతార నటించేందుకు అంగీకరించిందట.