Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రనిత్ రాజ్, అనిరుథ్, కళ్యాణి, నేహా హీరో,హీరోయిన్లుగా రాజేష్ తడకల దర్శకత్వంలో బి.జి.వేంచర్స్ పతాకంపై సంజరు వీరా నిర్మిస్తున్న చిత్రం 'గేమర్'. సోమవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ, 'నేను మొదట్నుంచి నా సినిమాల్లో కొత్త వారికి అవకాశాలిస్తున్నాను.
ఈ చిత్రంలో కూడా నటీనటులుగా కొత్త వారినే తీసుకున్నాను. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. బెట్టింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. మానవ విలువలకు స్కోప్ ఉంటుంది. లవ్, హర్రర్, సస్పెన్స్ అంశాల మేళవింపుగా ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించాం.
అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నమ్ముతున్నాం. బి.జి.యాక్టింగ్ అకాడమీని స్థాపించి యాక్టింగ్, డైరెక్షన్, ఇతర విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తున్నాను. అంతేకాదు ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయిన వారికి అవకాశాలు కూడా కల్పిస్తున్నాను. ఆసక్తిగల వారు ఇందులో జాయిన్ కావచ్చు' అని తెలిపారు. 'ఇది నాకు మొదటి చిత్రం. లవ్, హర్రర్, సస్పెన్స్, కామెడీ అనే నాలుగు ప్రధానాంశాలతో సాగే చిత్రమిది. ఇందులో నేను బెట్టింగ్ కాస్తూ అందరిని ఆటపట్టిస్తుంటాను. నా పాత్ర ఆకట్టుకుంటుంది' అని శ్రనిత్రాజ్ తెలిపారు. అనిరుథ్ చెబుతూ, 'ఇందులో నేను కామెడీ పాత్రలో అలరిస్తాను' అని చెప్పారు. 'ఈ చిత్రంలో మంచి పాత్రలు చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు
రాజేష్‌కు ధన్యవాదాలు' అని హీరోయిన్లు కళ్యాణి, నేహా తెలిపారు.