Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేడీ గెటప్‌లో కనిపించడం మన హీరోలకు కొత్తేమి కాదు. రాజేంద్రప్రసాద్, నరేష్, మంచు మనోజ్ తమ సినిమాలో మహిళ గెటప్ల్లో నటించి మెప్పించారు. తమిళ హీరో విజరు సేతుపతి సైతం ఇప్పుడు లేడీ గెటప్‌లో కనువిందు చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '96' చిత్రంలో మహిళా వేషధారణలో 'శిల్ప' అనే పాత్రలో కనిపించబోతున్నారట. దీనికి సంబం ధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. విజరు సేతుపతి.. చిరంజీవి నటించే 'సైరా నరసింహరెడ్డి' లో కీలక పాత్ర పోషించనున్నారు.