Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గురు' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకురాల సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో సూర్య ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చినట్టు సమాచారం. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సుధా కొంగర తయారు చేసిన స్క్రిప్ట్ కథానాయకుడు సూర్యకు తెగ నచ్చేసిందట. దీంతో ఈ సినిమాలో నటించడమే కాదు ఏకంగా తానే నిర్మించేందుకు కూడా సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ ప్రై.లి పతాకంపై సూర్య పట్టాలెక్కించనున్నాడట. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'థాన సెర్థా కూటమ్' చిత్రంలోను, 'అగారమ్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు కోసం ఫండ్ రైజింగ్‌లో సూర్య బిజీగా ఉన్నారు.