Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి ఒక్కరి జీవితంలో రాజకుమారి ఉంటుంది. నెగటివ్ స్వాభావం ఉన్న వ్యక్తి జీవితంలో రాజకుమారి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి వస్తే ఏం జరిగిందనే కథాంశంతో 'కథలో రాజకుమారి' సినిమాను తెరకెక్కించాం' అని అంటున్నారు దర్శకుడు మహేష్ సూరపనేని. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ప్రధాన పాత్రధారులుగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కథలో రాజకుమారి'. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
తేజ వద్ద అసిస్టెంట్‌గా..
మాది విజయవాడ. ఇంజనీరింగ్ వరకు అక్కడే చదువుకున్నా. యుఎస్‌లో మాస్టర్ చేసి ఇండియా వచ్చా. సినిమాలపై ఆసక్తితో దర్శకుడిని కావాలని ఇండిస్టీలోకి వచ్చాను. ఫస్ట్ తేజ వద్ద 'నీకు నాకు డాష్ డాష్' చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత కోన వెంకట్, పరుచూరి వెంకటేశ్వరరావు వద్ద రైటింగ్ వర్క్ చేశాను. అశ్వనీదత్ నాకు బాగా సపోర్ట్ చేశారు. గత ఐదేండ్లుగా వైజయంతి మూవీస్ బ్యానర్లో పనిచేశాను. అందులో కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేశాను. ఆ అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించాను. దర్శకుడిగా నాకిది తొలి చిత్రం.
నెగటివ్‌గా ఉంటుంది..
ఇది స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రం. ప్రతీకారం నేపథ్యంలో సాగే కథలో ప్రేమ పుడుతుంది. నారా రోహిత్ మొదటిసారి స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన స్వాభావికంగా నెగటివ్ క్యారెక్టర్‌ను కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి రాజకుమారి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి ఎలా వచ్చింది. రోహిత్ మంచి వాడిలా ఎలా మారాడు అన్నది సినిమా. బేసిక్‌గా నారా రోహిత్ ఇలాంటి కథలను బాగా ఇష్టపడతారు. ఆయనకు జోడీగా నమితా ప్రమోద్ నటించారు. నాగశౌర్య, నందిత గెస్ట్ రోల్స్ చేశారు. ఈ సినిమాలో ఓ సినిమా జరుగుతుంది. అందులో నాగశైర్య, నందిత కనిపిస్తారు. సినిమా అంతా ఓ హిల్ స్టేషన్లో జరుగుతుంది.
ఇళయరాజాతో..
ఇందులో మొత్తం ఏడు పాట లుంటాయి. వాటిలో ఐదు పాటలకు విశాల్ సంగీతం అందించారు. రెండు పాటలు ట్రిక్కీ సిచ్చువేషన్‌లో ఉంటాయి. వాటిని ఇళయరాజా చేస్తే బాగుంటుందని ఆయన్ని అప్రోచ్ అయ్యాం. ఇళయరాజాతో పనిచేయాలని నాలాంటి వాళ్ళకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఆయన కూడా ఈ రెండు పాటలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. హీరోయిన్ ఇంట్రో సాంగ్, హీరోయిన్ టీజింగ్ సాంగ్‌ను ఇళయరాజా చేశారు.
జెన్యూన్‌గా చెబుతున్నా..
ఈ చిత్రాన్ని గత నెల 25న విడుదల చేయాలనుకున్నాం. మంచి రిలీజ్ డేట్ కోసం సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నెల 15న సైతం చాలా సినిమాలున్నప్పటికీ ఆడియెన్స్ ప్రయారిటీ ప్రకారం ఈ తేదీ బెటర్ అనిపించింది. సినిమా విడుదలవుతుందంటే నాకెలాంటి టెన్షన్ లేదు. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాం. జెన్యూన్‌గా చెబుతున్నా మాట ఇది. నారా రోహిత్ కెరీర్లో ఇదొక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. నెక్ట్స్ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్ర ఫలితాన్ని బట్టి తదుపరి చిత్రాలుంటాయి.