Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై బాలీవుడ్లో ప్రస్తుతం ఓ బయోపిక్ తెరకెక్కుతున్న తరుణంలో తాజాగా మరో బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతుండటం విశేషం. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజరు అమృత్‌రాజ్ జీవితంపై ఓ బయోపిక్‌ను రూపొందించేందుకు రంగం సిద్ధమవుతోంది. సినీస్టాన్ ఫిల్మ్ కంపెనీ ఈ చిత్ర రైట్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలో ప్రధానంగా విజరు సాధించిన ఎచీవ్‌మెంట్స్, కెరీర్, వ్యక్తిగత జీవితం, దాతృత్వ కార్యకలాపాలను తెరకెక్కించాలని భావిస్తున్నారు. చెన్నైకి చెందిన విజరు అమృత్‌రాజ్ టెన్నీస్‌లో ఫస్ట్ ఛాంపియన్‌గా నిలిచారు. నటుడిగా మారి 'అక్టోపస్సీ', 'స్టార్ ట్రెక్ 4' చిత్రాలోన్లూ నటించారు. పలు టీవీ షోస్ కూడా చేశారు. తన జీవితంపై సినిమా రావడం పట్ల విజరు ఆనందం వ్యక్తం చేశారు. సినీస్టాన్ ఫిల్మ్ కంపెనీకి విజరు తనయుడు ప్రకాష్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.