Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ బోయినపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రయూనిట్ త్వరలో ప్రాగ్ వెళ్ళనుంది. ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, 'వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని హీరోగా, 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి హిట్స్ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ కలిసి చేస్తున్న చిత్రమిది. ఇప్పటికే చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పొల్లాచ్చిలో పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్‌పై చాలా హ్యాపీగా ఉన్నాం. రెండో షెడ్యూల్ కోసం ప్రాగ్ వెళ్ళనున్నాం. అక్కడ 20 రోజులపాటు జరిగే షూటింగ్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. దర్శకుడు రాసుకున్న ఆసక్తికరమైన కథ, భిన్నమైన పాత్రల తీరుతెన్నులు ఈ చిత్రానికి కీలకం. నాని ద్విపాత్రాభినయం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. 'ధృవ' ఫేమ్ హిప్ హాప్ తమిజ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించనుండగా, కార్తీక్ ఘట్టమనేని కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో నటించే హీరోయిన్ల వివరాలు త్వరలోనే రివీల్ చేస్తాం' అని అన్నారు.