Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు స్టార్డమ్ ఈజీ అయిపోయింది' అని అంటోంది అనుష్క శర్మ. బాలీవుడ్లో గ్లామర్ పాత్రలతోపాటు విభిన్న కథా నేపథ్య చిత్రాల్లో నటించే కథానాయికల్లో అనుష్క శర్మ ఒకరు. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా అభిరుచి చాటుకుంటున్నారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన అనుష్క తాజాగా స్టార్డమ్ గురించి మాట్లాడుతూ, 'నేను ప్రతిసారి విభిన్నమైన పాత్రలే నటించాలనే నిబంధనేమీ పెట్టుకోలేదు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి సూపర్స్టార్ల సినిమాల్లో నటించాను. అయితే వారికి స్టార్డమ్ రావడం అంత ఈజీగా జరిగింది కాదు. షారూఖ్‌ని 'కింగ్ ఆఫ్ రొమాన్స్', అమితాబ్ బచ్చన్‌ని 'యాంగ్రీ యంగ్ మ్యాన్' అని పిలిచినా అది వారి శక్తిసామర్థ్యాలను బట్టే నిర్ణయించారు. ఆ తరహాలోనే వాళ్ళూ నటించారు, ప్రేక్షకులు కూడా అలాగే ఫీలయ్యారు. కానీ అప్పటితో పోల్చితే ఇప్పుడు స్టార్డమ్కు అర్థమే మారిపోయింది. స్టార్డమ్ పొందడం చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడది అందరికీ అందుబాటులో ఉంటోంది' అని తెలిపింది. అనుష్క ప్రస్తుతం సంజరుదత్ బయోపిక్‌తోపాటు 'పరి', ఆనంద్ ఎల్.రారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో షారూఖ్ సరసన నటిస్తోంది.