Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షకీల(82) కన్నుమూశారు. షకీల బుధవారం మరణించినట్టు ఆమె బంధువు నాసిర్ ఖాన్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. 1950, 60లో ఆమె ఓ గొప్ప నటిగా, స్టార్‌గా వెలుగొందారు. 'ఆర్ పార్', 'సీఐడీ', 'బాబుజీ ధీరే చల్నా', 'ప్యార్ మే జరా సంభాల్నా', 'శ్రీమాన్ సత్యవాది', 'చైనా టౌన్', 'పోస్ట్‌బాక్స్ 999', దస్తాన్', 'సింధ్‌బాద్ ద సెయిలర్', 'రాజ్‌రాణి దమయంతి', 'ఆఘోష్', 'రాజ్ మహల్', 'అలీబాబా ఔర్ చాలీస్ చోర్', 'షెహన్షా' వంటి విజయవంత మైన చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. అగ్ర కథానాయికగా రాణించారు. ఆమె నటించిన చివరి చిత్రం 'ఉస్తాదన్ కి ఉస్తాద్'. ఇది 1963లో విడుదలైంది. షకీల భర్త జానీ బార్బర్. ఆ టైమ్‌లో ఆయన కూడా సినిమాల్లో పనిచేశారు.