Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్‌చరణ్, రాజమౌళి కాంబినేషన్లో 2009లో వచ్చిన 'మగధీర' ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు విదితమే. ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 'బాహుబలి 2' తర్వాత రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్‌చరణ్, రాజమౌళి కలిసి ఓ కథపై చర్చించారట. ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న 'రంగస్థలం 1985' చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవల రాజమౌళి సెట్‌కి వెళ్ళి చరణ్‌తో మాట్లాడారు. అంతేకాదు చిరంజీవి నటించబోతున్న 'సైరా నరసింహారెడ్డి' ఫస్ట్‌లుక్‌ను కూడా రాజమౌళినే విడుదల చేశారు. వీటన్నింటిని చూస్తే నెక్ట్స్ రామ్‌చరణ్‌తో రాజమౌళి సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర 2' సినిమా చేస్తే చూడాలనుందని ఇటీవల విజయేంద్రప్రసాద్ అన్నారు. దీంతో వీరి కాంబినేషన్లో 'మగధీర 2' రాబోతుందా? అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవమెంతా అనేది మున్ముందు తేలనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న 'రంగస్థలం 1985' చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.