Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రవీణ క్రియేషన్స్ పతాకంపై ఎన్.కరణ్‌రెడ్డి సమర్పణలో ఎన్.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'డేర్'. కె.కృష్ణప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఎన్.రామారావు మాట్లాడుతూ, 'లవ్, యాక్షన్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు మంచి రిపోర్ట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. మా చిత్రంలోని పాటలు ఆన్లైన్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న నవీన్ చేసిన ఫైట్లు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిన చిత్రమిది. ఈనెల 17న ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు.