Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశిష్ రాజ్, సిమ్రన్ జంటగా దీక్షాపంత్ కీలక పాత్రధారిణిగా నటిస్తున్న చిత్రం 'ఇగో'. సుబ్రమణ్యం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వీకేఏ ఫిల్మ్స్ పతాకంపై విజరు కరణ్, కౌసల్ కరణ్, అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో కైరాదత్ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. ఈ సందర్భంగా కైరా దత్ మాట్లాడుతూ, 'మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. సాయికార్తీక్‌తో నేను చేస్తున్న తొలి చిత్రమిది. పాట చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆశిష్‌రాజ్ భవిష్యత్‌లో సూపర్‌స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ''ఆకతాయి' తర్వాత వీకేఏ సంస్థలో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు చాలా పేర్లు అనుకున్నాం. ఫైనల్‌గా 'ఇగో' అనే టైటిల్ యాప్ట్ అనిపించింది. సినిమా చిత్రీకరణ మొత్తం పిక్నిక్లా సరదాగా సాగింది. చాలా ఎంజారు చేస్తూ షూటింగ్ జరిపాం. ఇద్దరు ఇగోయిష్టుల ప్రేమ కథ ఇది. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. హీరోగా నాకు మంచి పేరును తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది' అని హీరో ఆశిష్‌రాజ్ తెలిపారు. నిర్మాతలు చెబుతూ, 'సినిమా బాగా వస్తుంది. దర్శకుడు టేకింగ్ ఆకట్టుకుంటుంది. లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. కైరా దత్ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా నిలువనుంది' అని చెప్పారు.