Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని, అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ నాయకానాయికలుగా షైన్ స్క్రీన్క్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణార్జునయుద్ధం'. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని కృష్ణార్జునల పాత్రల లుక్స్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. 'కత్తులను తలపిస్తున్న కోరమీసాలు, పదునైన చూపులతో పక్కా మాస్ యాంగిల్లో ఉన్న నాని లుక్‌తోపాటు దీనికి పూర్తి విరుద్ధంగా క్లాస్ టచ్‌తో ఉన్న నాని లుక్కు అత్యద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రెండు విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్‌తో నాని అందరినీ అలరించడం ఖాయం. ఈ చిత్రంలో నానిని దర్శకుడు గాంధీ చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్రయూనిట్ తెలిపింది. ఈచిత్రానికి సమర్పణ: వెంకట్ బోయనపల్లి, సంగీతం : హిప్ హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్ : సాహి సురేష్, నిర్మాతలు :సాహు గారపాటి, హరీష్ పెద్ది,
దర్శకత్వం :మేర్లపాక గాంధీ.