Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచు లక్ష్మి ప్రధాన పాత్రధారిణిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈచిత్రానికి 'వైఫ్ ఆఫ్ రామ్' అనే టైటిల్ ఖరారు చేశారు. 'కథకు బాగా యాప్ట్ టైటిల్. ఈ టైటిల్‌కు సర్వత్రా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో మంచు లక్ష్మి పాత్ర చాలా భిన్నంగా సాగుతుంది. అబద్ధాలను నిజమని నమ్మే పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా, అద్భుతంగా ఉంటుంది. మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ ఇది. రాజమౌళి వద్ద పలు చిత్రాలకు పనిచేసిన విజరు యలకంటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్రబృందం తెలియజేసింది. సామ్రాట్‌రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి ఎడిటింగ్ : తమ్మిరాజు, కెమెరా : సామల భార్గవ్, సంగీతం: రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుహాసిని రాహుల్, మాటలు : సందీప్ గుంటా, సమర్పణ : కృతిప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్.