Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరూప్ భండారి, అవంతిక జంటగా అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రాజరథం'. అజరు రెడ్డి, అంజు వల్లభనేని, విష్ణు దకప్ప, సతీష్ శాస్త్రి నిర్మాతలు. ఈ చిత్రంలోని మొదటిపాటను హీరో విజరు దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఇప్పటికే టైటిల్ పాత్రలో రానాని రివీల్ చేశాం. ట్రైలర్ సైతం విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా విజరు దేవరకొండ విడుదల చేసిన 'కాలేజీ డేస్..' అనే పాట శ్రోతలను అలరిస్తోంది. రిలీజ్ కాగానే చార్ట్ బస్టర్‌గా నిలిచి సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తుంది. ఈ పాటకు దర్శకుడు అనూప్ భండారి సంగీతం సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. అద్భుతమైన లిరిక్స్‌తోపాటు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ట్యూన్స్‌కే నిర్మాతలు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి తన పద మాయాజాలంతో పాటకి అచ్చ తెలుగుదనాన్ని తీసుకొచ్చారు. ఈ పాట ప్రేక్షకులకు కాలేజ్ డేస్‌ను గుర్తు చేసింది. నిరూప్ భండారి, అవంతిక శెట్టి మీద బాలీవుడ్ కొరియోగ్రాఫర్లు బోస్కో, సీజర్ పర్యవేక్షణలో చిత్రీకరించిన ఈ పాట చాలా ట్రెండీగా ఉంటుంది. ఈ పాటలో నిరూప్, అవంతికలు కాలేజ్ స్టూడెంట్స్‌గా చాలా అందంగా కనిపిస్తారు. ఈ సినిమాను ఫిబ్రవరి 16న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.